Lahiru Thirimanne: లారీని ఢీకొన్న కారు.. శ్రీలంక క్రికెటర్‌కు తీవ్ర గాయాలు

శ్రీలంక మాజీ క్రికెటర్ లాహిరు తిరిమన్నె రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గురువారం (మార్చి 14) నాడు తన కారు లారీని ఢీకొనడంతో  కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటన అనురాధపురలోని తిరపన్నె ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్ కు చేర్చారు. నివేదికల ప్రకారం ఈ మాజీ క్రికెటర్‌కు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది.
 
స్వల్ప గాయాలు అవ్వడంతో అతని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఉపశమనం లభించింది. 2022లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన 34 ఏళ్ల ఆటగాడు క్రికెట్ లో పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. శ్రీలంక తరపున 44 టెస్టుల్లో 3 సెంచరీలతో 2088 పరుగులు.. 127 వన్డేల్లో 4 సెంచరీలతో 3164 పరుగులు చేశాడు. ఇక 26 టీ20ల్లో 291 పరుగులు చేశాడు.     

ALSO READ :- కాకా పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశారు : వినోద్ కుమార్