వరల్డ్ కప్ హీరో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెటర్ లహిరు తిరుమన్నే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఫేస్‌బుక్ ద్వారా రిటైర్మెంట్పై లహిరు తిరుమన్నే ప్రకటన విడుదల చేశాడు. లహిరు తిరుమన్నే క్రికెట్ కు వీడ్కోలు పలకడం శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో లంక జట్టులో తిరుమన్నే లేకపోవడం మైనస్ కానుంది.
బాధగా ఉంది కానీ తప్పదు..
క్రికెట్కు వీడ్కోలు చెప్పడం బాధగా ఉందని లహిరు తిరుమన్నే అన్నాడు. ఆటగాడిగా మైదానంలోకి దిగిన ప్రతీసారి...శక్తివంచన మేరకు ఉత్తమ ప్రదర్శన చేశానన్నాడు. క్రికెట్ను ఎంతో గౌరవించానని..అంతేకాకుండా లంక తరపున నిజాయితీగా ఆడానని తెలిపాడు. అయితే క్రికెట్కు వీడ్కోలు పలకడానికి గల కారణాలను మాత్రం చెప్పలేనన్నాడు. తనకు సహకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు, కోచ్లు, సహచర క్రికెటర్లు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నాడు.
భారత్పైనే అరంగేట్రం..
లహిరు తిరుమన్నే 2010లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియాతో మిర్పూర్లో ట్రై సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో తొలి అర్థ సెంచరీ సాధించాడు. 2014లో శ్రీలంక టీ20 వరల్డ్ కప్ గెలవగా...ఆ టీమ్లో తిరుమన్నే సభ్యుడు. తన 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో తిరుమన్నే 44 టెస్టు్ల్లో 3 సెంచరీలతో కలిపి 2,088 పరుగులు చేశాడు.
127 వన్డేల్లో 3,194 పరుగులు చేశాడు. 26 టీ20ల్లో 291 పరుగులు బాదాడు.
2015 వరల్డ్ కప్‌లో సెంచరీ
శ్రీలంక టీమ్లో టాపార్డర్ బ్యాట్స్మన్ అయిన తిరుమన్నే 2015లో సూపర్ ఫాంలో ఉన్నాడు. ఆ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 861 పరుగులు ఆ తర్వాత ఆసియా కప్‌లో రెండు సెంచరీలతో చేసి శ్రీలంక ఫైనల్ చేరడంతో పాటు..ఛాంపియన్గా నిలవడంలో కీ రోల్ ప్లే చేశాడు.