తినడానికే పుట్టారా.. బుక్ ఫేర్‌ను ఫుడ్ ఫెస్ట్‪గా మార్చారు

తినడానికే పుట్టారా.. బుక్ ఫేర్‌ను ఫుడ్ ఫెస్ట్‪గా మార్చారు

సాహిత్యం, రీడింగ్ అలవాట్లను పెంపొదించడానికి లాహోర్ లో ఇటీవల కాలంలో ఓ బుక్ ఫేర్ ప్రొగ్రామ్ పెట్టారు. బుక్ ఫేర్ కు వచ్చిన వారి కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అనుకోకుండా ఆ బుక్ ఫేర్ ఫుడ్ ఫెస్ట్ గా మారింది. బుక్ ఫేర్ కు వచ్చిన వారిలో చాలామంది బుక్స్ కంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ యే కొన్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే బుక్ ఫేర్ పెట్టిన ప్రధాన ఉద్దేశ్యం.. సాహిత్యం గురించి తెలియజేయడం.. కానీ, అక్కడ దానికి విరుద్దంగా జరిగింది. ఈ ఈవెంట్‍లో ఆశ్చర్యకరంగా 1200 షవర్మాలు, 800 బిర్యానీలు అమ్ముడు పోయాడు. కేవలం 35 బుక్స్ మాత్రమే వచ్చిన వారు కొన్నారు. 

Also Read :- ఏపీకి దానా తుఫాన్​ ముప్పు

ఇది విన్న ఎవరికైనా బుక్స్ కోసం వచ్చారా? లేక తినడానికి వచ్చారా ?  అనుమానాలు కలుగుతాయి.  బుక్ రీడింగ్ ఎకరేజ్ చేయడానికి, గొప్ప సాహిత్యాన్ని తెలియజేయడానికి పెట్టిన బుక్ ఫేర్ ను విజిటర్స్ ఉపయోగించుకోలేదు. వారి దృష్టి అంతా ఫుడ్ స్టాల్స్ పై పడింది. దీంతో బుక్స్ పక్కన పెట్టి తెగ తినేశారు. ఏకంగా 800 బిర్యానీలు, 1200 షవర్మాలు లాగించేశారు. బుక్స్ కోసం వచ్చిన వారు మాత్రం కేవతం 35 బుక్స్ మాత్రమే కొన్నారు.