
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన కొత్త సినిమా లైలా. రిలీజ్‌కు ముందు పొలిటికల్ కాంట్రవర్సీతో రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. లైలా మూవీ కలెక్షన్స్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. లైలా మూవీ 2025, ఫిబ్రవరి 14వ తేదీ రిలీజ్ అవ్వగా.. ఇప్పటికి నాలుగురోజులు. ఈ 4 రోజుల్లో.. ఏ రోజు ఎంత వచ్చింది.. వీకెండ్ తర్వాత వచ్చిన మండే.. అదేనండీ సోమవారం.. ఫిబ్రవరి 17వ తేదీన కలెక్షన్ ఎంత అనేది చూద్దాం..
2025, ఫిబ్రవరి 17వ తేదీ.. 4వ రోజు ప్రపంచ వ్యాప్తంగా లైలా మూవీ కలెక్షన్స్ జస్ట్ 7 లక్షల రూపాయలు మాత్రమే.. ఏంటీ అవాక్కయ్యారు. అవునండీ.. ఇది నిజం.. 7 లక్షల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ఈవెనింగ్ రెండు షోలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ రెండు షోలతో.. మరో 3 లక్షలు రావొచ్చని అంచనా.. ఏదేమైనా 4వ రోజు కలెక్షన్స్ 10 లక్షలకు మించదని సినీ ఇండస్ట్రీ టాక్.
ఇక లైలా మూవీ ఫస్ట్ డే కోటి 40 లక్షలు వచ్చింది.. 2వ రోజు 60 లక్షలు (శనివారం), 3వ రోజు 65 లక్షలు (ఆదివారం).. 4వ రోజు (సోమవారం) మొదటి రెండు ఆటలకు 7 లక్షలు.. ఇదీ లైలా కలెక్షన్స్. ఓవరాల్ గా ఇప్పటి వరకు 2 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చాయి. సినిమా బడ్జెట్ మాత్రం 40 కోట్లుగా చెబుతున్నది యూనిట్.
విశ్వక్ సేన్‌కు ఉన్న ఇమేజ్, ఫాలోవర్స్, ఫ్యాన్స్‌కు ఈ కలెక్షన్స్ చాలా చాలా దారుణం అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోవటం వల్లే ఈ దుస్థితి అని.. ఓ వర్గం మొత్తం వ్యతిరేకం అయ్యిందని.. అందుకే ఇంత దారుణమైన వసూళ్లు అని అంటున్నారు. మొత్తానికి లైలా మూవీకి వచ్చిన కలెక్షన్స్ మొత్తం.. ధియేటర్ అద్దెలు, కరెంట్ ఖర్చులకు అయినా వస్తాయా లేదా అనేది కూడా డౌటే.