
తెలుగు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా అభిమన్యు సింగ్, వెటరన్ హీరో పృథ్వీ, కమెడియన్ ప్రిథ్వి రాజ్, వినీత్ కుమార్, నరేష్, బ్రహ్మజి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఇక నూతన డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ సినీ నిర్మాత సాహూ గారపాటి నిర్మించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన లైలా సినిమా ఇదే విధంగా కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. దీనికితోడు సినిమా రిలీజ్ కి ముందు పలు కాంట్రవర్సీలు తలెత్తడంతో కలెక్షన్స్ విషయంలో భారీ దెబ అపడినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని నిర్మాత సాహో గారపాటి దాదాపుగా రూ.40 కోట్లు వెచ్చించి తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే Sacnilk సమాచారం ప్రకారం ఇప్పటివరకూ లైలా సినిమా కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. రిలీజ్ కి ముందు ఎలాంటి బజ్ లేకపోవడంతో కంప్లీట్ గా మౌత్ టాక్ పై డిపెండ్ అయ్యింది. దీంతో మొదటి షో పడిన తర్వాత కలెక్షన్స్ పెరుగుతాయని అనుకుంటే సినిమాలో పసలేదని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో రోజురోజుకి మరింత దారుణంగా పడిపోతున్నాయి.
ALSO READ | రికార్డ్స్ రపా...రపా.. ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2 ..
అయితే విశ్వక్ సేన్‌కు ఉన్న ఇమేజ్, ఫాలోవర్స్, ఫ్యాన్స్‌కు ఈ కలెక్షన్స్ చాలా చాలా దారుణం అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోవటం వల్లే ఈ దుస్థితి అని.. ఓ వర్గం మొత్తం వ్యతిరేకం అయ్యిందని.. అందుకే ఇంత దారుణమైన వసూళ్లు అని అంటున్నారు. మరికొందరు మాత్రం సినిమాలో పస ఉంటే కచ్చితంగా వర్కౌట్ అవుతుందని కానీ కథ కనెక్ట్ కాకపోతే మాత్రం ఫ్లాప్ తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్స్.. నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ కలిపి దాదాపుగా రూ.18 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈలెక్కన చూస్తే దాదాపుగా రూ.20 కోట్లు పైగా ప్రొడ్యూసర్ కి లాస్ వచ్చినట్లు తెలుస్తోంది. మాములుగా నిర్మాతలు నష్టపోతే హీరోలు స్పందించి రెమ్యునరేషన్ లో కొంతభాగం తిరిగివ్వడం, లేదా అదే నిర్మాతతో ఫ్రీగా సినిమా చెయ్యడం వంటివి చేస్తుంటారు. మరి విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.