ఓటీటీలో కూడా లైలా అట్టర్ ప్లాప్.. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమాత్రం ఎక్కడం లేదట..

ఓటీటీలో కూడా లైలా అట్టర్ ప్లాప్..  ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమాత్రం ఎక్కడం లేదట..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ అయినా విషయం తెలిసిందే.. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జంటగా హిందీ బ్యూటీ ఆకాంక్ష శర్మ నటించగా నూతన దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిచాడు. రొమాంటిక్ లవ్ జోనర్ లో రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. దాదాపుగా రూ.20 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చించి తీసిన ఈ సినిమా కనీసం రూ.3 కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేదు. దీంతో విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

 
అయితే ఇటీవలే లైలా సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని లైలా పెద్దగా మెప్పించలేకపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లైలా  ఓటీటీలో రిలీజ్ అయ్యి రెండు రోజులు కావస్తున్నప్పటికీ కనీసం  వ్యూస్ కూడా రానట్లు తెలుస్తోంది. అయితే  స్టోరీ నేరేషన్ వీక్ గా ఉండటం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం దీనికితోడు లైలా రిలీజ్ కు ముందు ఈ సినిమాలో నటించిన పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడంతో మొదటినుంచే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ మొదలైంది... 

Also Read : : జైలర్ సీక్వెల్ మొదలెట్టేసిన రజనీకాంత్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం.. విశ్వక్ సేన్ లైలా మూవీ దెబ్బకి స్క్రిప్ట్స్ ని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా క్రింజ్ కామెడీ స్టోరీని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్వక్ తెలుగులో "ఫంకీ" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వ్యాఖ్ డ్రాప్ లో జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తన్నాడు.  ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు.