![విశ్వక్ సేన్ లైలా ట్రైలర్ రిలీజ్.. పువ్వు లేదు కాయ ఉందంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్..](https://static.v6velugu.com/uploads/2025/02/laila-movie-official-trailer-out_DM6iQyVuS2.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత సాహూ గారపాటి నిర్మించాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూసేద్దాం..
హీరో విశ్వక్ సేన్ సోను అనే యువకుడిపాత్రలో నటించినట్లు తెలుస్తోంది. సోను అనుకోకుండా తన ఏరియా ఎమ్మెల్యే తో గొడవపడి తప్పించుకుని తిరుగుతుంటాడు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యే మనుషులు సోను కోసం వెతుకుతూ ఉంటారు. వీరిలో నుంచి తప్పించుకునేందుకు సోను లేడీ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ ఉంది. అలాగే మేకింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో యూయూత్ కి బాగానే కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.
ALSO READ | అమ్మాయిలని ఏడిపించకండి.. ఆటోమేటిక్ గా ఫేస్ గ్లో వస్తుందంటున్న నాగ చైతన్య..
ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో జెండర్ ని ఉద్దేశిస్తూ పువ్వు లేదు కాయ ఉందంటూ చెప్పే డైలాగ్స్, లేడీ గెటప్ లో సోను విలన్ తో ప్రేమలో పడటం ఇవన్నీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెటరన్ హీరో పృథ్వీ రాజ్, అభిమన్యు సింగ్, రవి మరియా, నాగినీడు, హర్ష వర్ధన్ తదితరులకి డైలాగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఫర్వాలేదనిపించారు. హీరోయిన్ ఆకాంక్ష శర్మ మాత్రం గ్లామర్ ట్రీట్ ఇచ్చిండనై చెప్పవచ్చు. ఓవరాల్ గా ట్రైలర్ తో అంచనాలు పెంచిన విశ్వక్ సేన్ థియేటర్స్ లో ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం రోజున ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.