![లైలా మూవీ ఓపెనింగ్ ఎఫెక్ట్ .. షోలు, థియేటర్లు తగ్గించారా..?](https://static.v6velugu.com/uploads/2025/02/laila-movie-shows-and-theatre-are-decreased-for-no-openings_MQZGiB9jzX.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా అభిమన్యు సింగ్, వెటరన్ హీరో పృథ్వీ రాజ్, అభిమన్యు సింగ్, రవి మరియా, నాగినీడు, హర్ష వర్ధన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. లైలా మూవీ ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్స్ తో వైసీపీ ఫ్యాన్స్ ఈ సినిమాని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేశారు. దీంతో ఈ ప్రభావం సినిమా రిజల్ట్స్ పై పడినట్లు తెలుస్తోంది.
అయితే లైలా సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. దీంతో చాల చోట్ల థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఫస్ట్ షో పూర్తయిన తరవాత టాక్ ని బట్టి టికెట్స్ బుక్ అవుతాయని అనుకుంటే పబ్లిక్ టాక్ తేలిపోవడంతో టికెట్లు తెగడం లేదు. దీంతో పలు చోట్ల షోలు తగ్గించినట్లు సమాచారం. అయితే ఈరోజు రిలీజ్ అయిన బ్రహ్మ ఆనందం సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ కూడా హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఈ రకంగా చూస్తే లైలా సినిమాకి థియేటర్స్ కూడా తగ్గే అవకాశం ఉంది.
ALSO READ | ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం.. ఏమైందంటే..?
ఈ విషయం ఇలా ఉండగా లైలా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ వ్యంగంగా కామెంట్లు చేశాడు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ బాయ్ కాట్ లైలా అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్, నటుడు పృథ్వీ సారీ చెప్పినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం కన్వెన్స్ కాలేదు. ఫలితంగా లైలా సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి.