మామడ మండలంలో..ఉల్లాసంగా.. బర్డ్​ వాచ్​

మామడ మండలంలో..ఉల్లాసంగా.. బర్డ్​ వాచ్​

మామడ మండలంలోని చెరువులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో నల్దుర్తి తుర్కం చెరువు, పొన్కల్ వెంగన్న చెరువుల వద్ద అటవీశాఖ బర్డ్ వాచ్, నేచురల్ క్యాంప్ నిర్వహించగా.. హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. 

ఆ ప్రాంతాల్లోని పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. స్నేక్ ల గురించి స్టడీ చేశారు. అటవీ అధికారులు వారి వెంట ఉండి సపారీ వాహనంలో పలు ప్రదేశాలు చూపించారు. దిమ్మదుర్తి రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ నేచర్ క్యాంపులు నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ ఎఫ్ఆర్​వో రామకృష్ణారావు, డీఆర్​వో నజీర్ ఖాన్, ఎఫ్ఎస్​వోలు శ్రీనివాస్, అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు. - లక్ష్మణచాంద (మామడ), వెలుగు