
- మందకృష్ణ మాదిగ
పద్మారావునగర్, వెలుగు: ఫిబ్రవరి 7న జరగబోయే వేల గొంతులు.. లక్ష డప్పుల అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శన కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బన్సీలాల్‌పేటలోని మల్టీపర్పస్హాల్లో హైదరాబాద్జిల్లా సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత లీడర్ కొండూరు రాజ ఎల్లయ్యకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మందకృష్ణ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి ఐదు నెలలవుతున్నా ఇంకా వర్గీకరణ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. తాను 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నానని, దేశంలోనే తొలిసారిగా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చి తమకు మద్దతు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూలదోస్తామని హెచ్చరించారు. కార్పొరేటర్లు కే.హేమలత, ప్రసన్న లక్ష్మీ,మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.