నిమజ్జనానికి రెడీ అయిన లక్ష గణేష్ విగ్రహాలు

 గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేశామని, అందులో దాదాపు 20 వేల విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ పేర్కొంది. మిగిలినవి సరూర్‌నగర్ సరస్సు, సఫిల్‌గూడ, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ ట్యాంక్, పల్లె చెరువు, శంషాబాద్ సరస్సు, ఇబ్రహీంపట్నం ట్యాంక్ మరియు ఎదులాబాద్ ట్యాంక్ నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి. 

విగ్రహాల నిమజ్జనానికి అనువుగా హుస్సేన్‌సాగర్‌ వద్ద తగినన్ని క్రేన్‌లు ఏర్పాటు చేశామని, ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.,సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు సజావుగా జరిగేందుకు పౌరులందరూ శాంతి, ప్రశాంతతలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ALSO READ : డాన్స్ రారాజు : మైకల్ జాక్సన్ టోపీ రూ.68 లక్షలు..

మరోవైపు  గ్రేటర్ పరిధిలో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు తీసుకున్నారు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మొత్తం 21 కి.మీ మేర శోభాయాత్ర సాగనుంది. శోభాయాత్ర జరిగే ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టారు. శోభాయాత్రను పూర్తిగా సీసీటీవీ కెమెరాలో నిఘా నీడలోకి తెచ్చారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,బార్లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూసివేయాలనిఆదేశాలు జారీ చేశారు.