లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో రైతుల మీదుగా వాహనాలు దూసుకెళ్లడంతో నలుగురు రైతులతోపాటు కారు డ్రైవర్, ఓ జర్నలిస్టు, మరో ఇద్దరు కలిపి మొత్తం 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడనే అభియోగంపై గత అక్టోబర్ 9వ తేదీన అరెస్టు చేశారు. ఘటన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి చార్జిషీట్ దాఖలు చేసింది. అనంతర పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. గత అక్టోబర్ 9వ తేదీన అరెస్టయిన అశిష్ మిశ్రా కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది.
ఇవి కూడా చదవండి
లతా మంగేష్కర్ కు ఐక్య రాజ్య సమితి నివాళి
తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం