
యూపీలో దారుణం..కాలేజీ స్టూడెంట్ను అమానించాడనే నెపంతో దారుణంగా కొట్టారు..అరకిలోమీటరు పరుగెత్తించి హింసించారు..ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ దుకాణంలోకి వెళ్లగానే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాడీ మొత్తం బుల్లెట్లతో తూట్లుతూట్లుగా కాల్చి చంపారు. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఈ దారుణంగా జరగడంతో స్థానికులు ఆందోళన చెందారు. యూపీలో శాంతిభద్రతలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ఈ దారుణ ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..
యూపీలోని లఖీంపూర్ లో బీబీఏ విద్యార్థి అమోగ్ సేథ్ ను దారుణంగా కాల్చి చంపారు దుంగడులు.లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మిశ్రానా పోలీస్ అవుట్‌పోస్ట్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు అన్మోల్ లో అమోగ్ కు మధ్య ఆదివారం గొడవ జరిగింది. ఈ గొడవలో అన్మోల్ ను అమోగ్ అవమానించాడని కక్ష పెంచుకొని తన స్నేహితులతో కలిసి అమోగ్ ను దారుణంగా కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.
Also Read:-EV కార్లపైనా పన్ను.. 6 శాతం కట్టాలంటున్న మొదటి రాష్ట్రం ఇదే..!
అమోగ్ సేథ్ ఛాతీపై బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఒక షాప్ అసిస్టెంట్ చేతికి కూడా బుల్లెట్ గాయమై ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అమోగ్ స్థానికంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఓనర్ కొడుకు. నిందితుడు ఓ లాయర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.