గత మూడు రోజులుగా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గోవిందరావుపేట మండలంలోని టూరింగ్ స్పాట్ లక్నవరం సరస్సు దగ్గర నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయింది. భారీ వర్షాల వల్ల సరస్సులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దాంతో సరస్సు పొంగిపొర్లుతుంది. భారీగా వరద నీరు రావడంతో.. పర్యాటకుల కోసం నిర్మించిన ఉయ్యాల వంతెన ఫుట్‌వే మునిగిపోయింది. గతంలో కూడా ఇదే తరహాలో ఉయ్యాల వంతెనలు ముంపునకు గురయ్యాయి.
For More News..