![అడవి, కొండలు.. వాటి మధ్యలో నీళ్లు](https://static.v6velugu.com/uploads/2022/03/laknavaram-is-one-of-the-best-tourist-place-in-telangana_mNXqSZgAYM.jpg)
చుట్టూరా ఆకుపచ్చని అడవి, కొండలు.. వాటి మధ్యలో నీళ్లు... ఇవన్నీ ఒకే చోట చూడాలంటే లక్నవరం వెళ్లాల్సిందే. ప్రకృతి అందాలని చూస్తూ, హాయిగా సేదతీరాలి అనుకునేవాళ్లకు ఈ ప్లేస్ బెస్ట్ ఛాయిస్. కాకతీయుల కాలం నాటి ఈ చెరువు వారసత్వ సంపదకి నిదర్శనం కూడా. నేచర్ ఫొటోగ్రఫీ లవర్స్, టూరిస్ట్‌ల ఫేవరెట్ లిస్ట్‌లో ఒకటైన ఈ చెరువు ములుగు జిల్లాలోని గోవింద రావుపేట మండలంలో ఉన్న లక్నవరంలో ఉంది.
లక్నవరం చెరువులో చిన్న ఐలాండ్స్ 13 ఉంటాయి. ఇక్కడికి వెళ్లే రోడ్డుకి రెండు వైపులా పెద్ద చెట్లు ఉంటాయి. కొండలు, చెట్లతో ఉన్న ఈ రోడ్డులో జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చెరువు దగ్గరికి వెళ్లే దారిలో రకరకాల పక్షులు కనిపిస్తాయి. ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి. అంతేకాదు చెరువు పక్కనే ఉన్న కొండల మీద ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఈ చెరువులో బోట్ రైడింగ్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడికి వెళ్తే రామప్ప గుడి కూడా చూసి రావొచ్చు. లక్నవరం చెరువుకి30 కిలోమీటర్ల దూరంలో రామప్ప గుడి ఉంది.
హ్యాంగింగ్ బ్రిడ్జ్
లక్నవరం చెరువులో స్పెషల్ అట్రాక్షన్... హ్యాంగింగ్ బ్రిడ్జ్. 160 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ మూడు ఐలాండ్స్‌ని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ ప్లేస్ ఫొటోలు, సెల్పీలు దిగేందుకు మంచి లొకేషన్. ఒక రోజు అక్కడే ఉండాలి అనుకుంటే రెండు కాటేజీలు ఉన్నాయి. పూర్తిగా చెక్కతో కట్టిన ఈ కాటేజీల్లో ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. టూరిజం వాళ్ల హరిత హోటల్లో కూడా ఉండొచ్చు. ఫుడ్ కూడా దొరుకుతుంది.
ఇలా వెళ్లాలి
ములుగు నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది లక్నవరం చెరువు. వరంగల్ నుంచి 80 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 220 కిలోమీటర్ల జర్నీ.
టైమింగ్స్: వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు.
ఎంట్రీ ఫీజు పిల్లలకు రూ.5, పెద్దవాళ్లకు రూ.10.
బోటింగ్ ఛార్జీలు: పిల్లలకు రూ.30, పెద్దలకు50, స్పీడ్ బోట్‌కి రూ.300. ఇందులో నలుగురు వెళ్లొచ్చు.