నిర్మల్ జిల్లా: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలంటూ.. సరస్వతి దేవి అమ్మవారి అనుగ్రహం కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
38 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు అమ్మవారి సన్నిధిలో మహా హారతి నైవేద్యం సమర్పించిన తర్వాత దీపాలు వెలిగించారు. అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.