- యూటీఎఫ్ రాష్ట్రకార్యదర్శి లక్ష్మారెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా బడ్జెట్లో విద్యారంగానికి నిధులు పెంచాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) స్టేట్‌సెక్రటరీ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఏటా ఒక్కో శాతం బడ్జెట్‌ను తగ్గిస్తూ తొమ్మిది ఏండ్లలో 14 నుంచి 6 శాతం వరకు తీసుకొచ్చిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి కేవలం 7 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. విద్యా కమిషన్ రాష్ర్ట వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలను స్పీడప్ చేయాలని, తల్లిదండ్రులు, మేధావులు, టీచర్ల నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించాలన్నారు.
యూటీఎఫ్ కామారెడ్డి జిల్లా కార్యవర్గం
యూటీఎఫ్ కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రెసిడెంట్‌గా ఆకుల బాబు, జనరల్ సెక్రటరీగా సాయిలు, వైస్ ప్రెసిడెంట్లుగా బి.వెంకటరెడ్డి, ఏమిలియా, ట్రైజరర్గా రూప్సింగ్, రాష్ర్ట కన్వీనర్‌గా కె. రాజవర్ధన్, సెక్రటరీలుగా వై. గోపాల్, ఎం.గోపాల్, ఎన్. నారాయణ, బాలయ్య, సాయిగీతమ్, దయాకర్, నాంపల్లిని ఎన్నుకున్నారు.