
సాయి కుమార్ లీడ్ రోల్‌లో సూర్య దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. ఇదొక పొలిటికల్ సెటైర్ సినిమా. ‘ఫర్ ఓట్’ అనేది ట్యాగ్‌లైన్. యు శ్రీనివాసుల రెడ్డి, బి నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే పురుషోత్తం రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సాయి కుమార్ చేత్తో రెండు వేల నోట్లను పట్టుకుని ఆనందంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
ఓటుకు ఇంత డబ్బులు అని రాజకీయ నాయకులు నిర్ణయించడం కామన్. కానీ ఓటరే తన రేటును నిర్ణయించుకునే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు మేకర్స్. వినయ్, అరుణ్, దీప్తి వర్మ, ఆమని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు.