
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్ముడు మనోజ్‍ను చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు అక్క మంచు లక్ష్మి. మంచు లక్ష్మికి చెందిన టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించింది.
శనివారం సాయంత్రం (ఏప్రిల్ 12న) హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా తన సోదరుడు మంచు మనోజ్ స్టేజ్ వెనుక నుంచి వచ్చి, అక్క లక్ష్మీ మంచుని తట్టడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. ఆమె నేలపై కూర్చుని, మనోజ్ ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ప్రస్తుతం మంచు కుటుంబంలో జరుగుతున్న చాలా పరిణామాల మధ్య మనోజ్ కనిపించడంతో మంచు లక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ఇక ఆమెను మనోజ్ మరియు అతడి భార్య మౌనిక ఓదార్చుతున్న ఈ వీడియో వైరల్ గా మారింది.
#ManchuLakshmi got emotional 🥹 as soon as she saw her brother #ManchuManoj at an event yesterday 🖤 pic.twitter.com/G7dEoWnCZq
— TFI World (@RamRam246428691) April 13, 2025
మంచు లక్ష్మి అంతలా భావోద్వేగం చెందడంపై మనోజ్ స్పందిస్తూ.. “మేము చాలా కాలంగా కలవలేదు. నేను ఆలస్యంగా వచ్చినందుకు ఆమె బాధపడింది." అని తెలిపాడు.
అయితే, మంచు కుటుంబంలో కొంతకాలంగా ఆస్తి వివాదం ముదురుతోన్న సంగతి తెలిసిందే.మనోజ్ తన సోదరుడు మంచు విష్ణు తనను ఇబ్బంది పెట్టాడని ఆరోపించాడు. ఈ వివాదంపై ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం, మంచు మనోజ్ తన తండ్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వెలుపల ధర్నాకు దిగడం వంటివి, అక్కడ మీడియాతో మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.
అందులో భాగంగా తన ఇంటిని ధ్వంసం చేసి తన కారును దొంగిలించాడని ఆరోపించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. విష్ణుకు నేనేనంటే కుళ్లు.. నన్ను ఎదగనివ్వకుండా తొక్కేశారు అంటూ మనోజ్ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు.