ముగిసిన లక్ష్మీనరసింహ స్వామి జాతర

ముగిసిన లక్ష్మీనరసింహ స్వామి జాతర

ములుగు, వెలుగు : ములుగు మండలం కొత్తూరు గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహుడి జాతర హోలీ వేడుకలతో ముగిసింది. మూడు రోజులుగా సాగిన స్వామి వారి ఉత్సవాలు చివరి రోజైన శుక్రవారం హోమం నిర్వహించారు. ప్రధాన అర్చకులు ముడుంబా రఘునందనాచార్యులు పూజలు నిర్వహించగా, ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరంనేని కిషన్​రావు, గ్రామ పెద్ద రవీందర్​రావు దంపతులు పాల్గొన్నారు. 

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. బండ్లు తిప్పి భక్తులు మొక్కులు చెల్లించారు. గుట్ట కింద భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాయిని గూడెం పీహెచ్​సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.