కోటంచ గ్రామంలో సూర్యవాహనంపై ఊరేగిన నృసింహస్వామి

  • వైభవంగా కోటంచ లక్ష్మినృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • నేడు కల్యాణ వేడుకలకు ముస్తాబైన ఆలయం

రేగొండ, వెలుగు: కోరిన కొర్కెలు తీర్చే లక్ష్మీనృసింహస్వామి భక్తుల గోవింద నామస్మరణలు, సంకీర్తనలతో సూర్యవాహనంపై మాడ వీధుల్లో ఊరేగాడు. బ్రహ్మోత్సవ శోభతో స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో అభయ స్వరూపిడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.తననునమ్మి కొలిచిన భక్తులకు అండగా ఉంటూ తన మహిమాన్వితాన్ని చాటుకుంటున్నాడు.

ప్రతి ఏటా పాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ ఆలయం బ్రహ్మోత్సవ శోభతో భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయాన్ని స్వామివారికి అభిషేకం చేశారు.   అనంతరం సూర్యవాహనంపై స్వామివారిని మాడవిధుల్లో ఊరేగింపు చేశారు.  

ఆలయ సన్నిధి ఆధ్యాత్మికం..

బ్రహ్మోత్సవాల వేళ కోటంచ లక్ష్మీనృసింహస్వామి కొలువు దీరిన ఆలయ సన్నిధి ఎంతో పవిత్రతో కూడికుని ఆధ్యాత్మికతను పంచుతోంది. ఆలయ సన్నిధికి వచ్చే భక్తులకు భక్తిభావంతో పాటు స్వామివారికి అభయం పొందినట్లుగా అనుభూతిని పొందడం బ్రహ్మోత్సవాల ప్రత్యేకత. యాజ్నికులు, రుత్వికుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేధపఠనం చేయడం భక్తి పారవశ్యాన్ని పెంపోందిస్తుంది. కాగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ చైర్మన్​ మూల్కనూరి భిక్షపతి, ఈవో బిల్ల శ్రీనివాస్​ పర్యవేక్షిస్తున్నారు.