చంద్రబాబుదంతా సెల్ఫ్ డబ్బా.. జగన్ గెలుపు ఖాయం

ఏపీ సీఎం చంద్రబాబు లాగా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వారు చరిత్రలో కనపడరని విమర్శించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. ఇవాళ ఉదయం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన లక్ష్మీపార్వతి… చంద్రబాబు తన గురించి తాను అతిగా పొగుడుకుంటున్నారని… ఆయన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని  అన్నారు. 14 సంవత్సరాలు సీఎం, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న చంద్రబాబు తన హయాంలో ఈ ప్రాజెక్టు తెచ్చాను అనిగాని, ఒక మంచి పథకం ప్రవేశపెట్టానని చెప్పగలరా అని ప్రశ్నించారు.

“చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు.  1994లో ఎన్టీఆర్ గెలిపించిన పార్టీని కాజేసి వెన్నుపోటు పొడిచాడు.  గోప్యంగా ఉంచాల్సిన ప్రజల డేటాను చోరీ చేశారు. ప్రజల వ్యక్తిగత డేటాను ప్రైవేటు సంస్ధలకు ఇచ్చారు. ఎన్టీఆర్ టైమ్ లో కేవలం రూ.3 వేల కోట్ల అప్పుఉంటే 60 వేల కోట్ల రూపాయల అప్పుకు తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుది. కుట్రలకు చంద్రబాబు మారుపేరు. ప్రతిపక్షనేతకు అభిమానం పెరిగిపోతుంటే వైయస్ జగన్ ను చంపించేందుకు కూడా వెనకాడలేదు” అని అన్నారు.

లోకేశ్ కు ఏ తెలివితేటలు లేవు

“లోకేష్ కు స్టాన్ ఫోర్డ్ నుంచి సర్టిఫికేట్ కొని ఇచ్చావు. ఎలాంటి తెలివితేటలు లేని లోకేష్ ను విద్యావేత్త అని  ప్రచారం చేసుకుంటున్నావు. 26 కేసులలో స్టే తెచ్చుకున్న చంద్రబాబు నీతిమంతుడేం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోంది. సర్వేలన్నీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని చెబుతున్నాయి. 50 వేల ఎకరాలు అమరావతి కోసం సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. -వ్యవస్దలన్నింటినీ చంద్రబాబు భ్రష్టుపట్టించారు. చంద్రబాబు 40 ఏళ్ల సీనియారిటీ 40 ఏళ్ల యువకుడైన జగన్ ముందు నిలవలేకపోయింది. నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలు సంరక్షించాలి” అని లక్ష్మీపార్వతి అన్నారు.