తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారన్నారు లక్ష్మీ పార్వతి. మంగళవారం ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడా. జీవిత రాజశేఖర్‌లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది.’’ అని లక్ష్మీ పార్వతి తెలిపారు. రెండు రాష్ట్రాల క్షేమాన్నే ఎన్టీఆర్ కోరుకుంటారన్నారు. ఎన్టీఆర్ కలలు గన్న రాష్ట్రంగా ఏపీ మారుతోందని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్నారు లక్ష్మీపార్వతి.