![కనుల పండువగా ప్రభ బండ్ల ఊరేగింపు](https://static.v6velugu.com/uploads/2025/02/lakshmi-thirupathamma-gopayya-swamula-jatara-a-vibrant-celebration-in-chidella-village_TltA1NqgIv.jpg)
పెన్ పహాడ్, వెలుగు : మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో జరుగుతున్న లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వాముల జాతరలో భాగంగా గురువారం ఆలయ కమిటీ చైర్మన్ మోదుగు నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ దేశగాని రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ప్రభ బండ్ల ఊరేగింపు కనుల పండువగా జరిగింది. బండ్ల ఊరేగింపును చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వాముల జాతరకు రాష్ట్ర నలు దిశల నుంచి భక్తులు వచ్చారని, వారికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల మహిళా ఇన్విటేషన్ కబడ్డీ క్రీడలు ప్రారంభిస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు తంగళ్లగూడెంలో అమ్మవారి విగ్రహ ఊరేగింపు, రాత్రి 8 గంటలకు రవి మెలోడీస్ ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, పీఏసీఎస్చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, మాజీ సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి, తంగెళ్లగూడెం మాజీ సర్పంచ్ ఈశ్వరమ్మ, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.