గుట్టకు చేరిన లక్ష్మీనారసింహుడి అఖండజ్యోతి

యాదగిరిగుట్ట, వెలుగు: శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 8న హైదరాబాద్ బర్కత్ పురాలోని యాదగిరి భవన్ నుంచి బయలుదేరిన లక్ష్మీనారసింహుడి అఖండజ్యోతి సోమవారం రాత్రి యాదగిరిగుట్టకు చేరుకుంది. ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య భార్య బీర్ల అనిత, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్‌‌‌‌తో పాటు కౌన్సిలర్లు కలిసి మంగళహారతులతో స్వాగతం పలికి పూజలు చేశారు.

 అర్చకులు అఖండజ్యోతి తీసుకొచ్చిన వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.  వైకుంఠ ద్వారం వద్ద లక్ష్మీనరసింహుల విగ్రహాలకు పూజలు నిర్వహించిన అనంతరం.. రాత్రి 10 గంటలకు రాయగిరి చెరువులో స్వామిఅమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు.