భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ కొత్త అధ్యక్షుడిగా లక్ష్మీపతి గౌడ్ ఎన్నికయ్యారు. ఆయన మణుగూరు ఓపెన్ కాస్ట్ లో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నారు. జనరల్ సెక్రెటరీగా ఆర్ జీ 2 ఏరియాలో ఎస్ఈ గా పనిచేస్తున్న పెద్ది నరసింహులు, కోశాధికారిగా కొత్తగూడెం కార్పొరేట్ లో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న నరేశ్, వైస్ ప్రెసిడెంట్ గా ఆర్జీ వన్ లో అడిషనల్ మేనేజర్ గా పనిచేస్తున్న కొనుగోటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
కొత్తగూడెం కార్పొరేట్ సీఎంఓఏఐ ప్రెసిడెంట్ పదవికి విజయ భాస్కర్, దిలీప్ పోటీ చేశారు. ఇద్దరికీ సమానంగా 193 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. కార్పొరేట్ ఏరియా సెక్రటరీగా కేశవరావు ఎన్నికయ్యారు.