గోదావరిఖని, వెలుగు : ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిదకు టెండర్ వేయకుండా ప్రభావిత ప్రాంతాలైన లక్ష్మీపూర్, ఎల్కలపల్లి, మారేడుపాక, తదితర గ్రామాలకు అప్పగించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎల్కలపల్లి గేట్ సమీపంలోని ఎన్టీపీసీ రిజర్వాయర్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ ఎన్టీపీసీ రిజర్వాయర్లోని బూడిదను తరలించేందుకు బుధవారం ఆన్లైన్ టెండర్ వేయనున్నారని, వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, కార్పొరేటర్లు, పార్టీ లీడర్లు పాల్గొన్నారు.