
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు, ప్రముఖ నాట్యగురు డా.అలేఖ్య పుంజాల శిష్యురాలు లక్ష్య రాచప్రోలు కూచిపూడి అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కనుల పండువగా జరిగింది. ‘అమ్మా ఆనంద దాయని’, ‘భామా కలాపం’లో తన అభినయంతో ప్రేక్షకుల చూపులను కట్టిపడేసింది. ‘బృందావని తిల్లానా’తో ఘనమైన ముగింపునిచ్చింది.
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ ప్రతిభ ప్రహ్లాద్ లక్ష్యను అభినందించారు. లక్ష్య ప్రస్తుతం ఇండోర్ లో స్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేస్తోంది.