న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దాదాపు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ ర్యాకింగ్స్‌లో ఇండియా నుంచి హెచ్. ఎస్. ప్రణయ్, లక్ష్యసేన్ వరుసగా 9, 13వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ర్యాంకింగ్స్ ప్రకారం టాప్–16లో ఉన్న ప్లేయర్లకు ఒలింపిక్స్‌లో పోటీపడే చాన్స్ దక్కుతుంది. దీంతో ఇండియా నుంచి మెన్స్ సింగిల్స్‌లో ప్రణయ్, లక్ష్య బరిలోకి దిగే చాన్స్ ఉంది.
ఇదే జరిగితే 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియా నుంచి ఇద్దరు ప్లేయర్లు మెన్స్ సింగిల్స్‌లో బరిలో ఉంటారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అభిన్ శ్యామ్ గుప్తా, నిఖిల్ కనెట్కర్ ఒలింపిక్స్‌లో ఆడారు. ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్‌లో సెమీస్‌కు చేరుకోవడం ద్వారా లక్ష్యసేన్ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. ఇక విమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు, మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ రెండోసారి మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనున్నారు.