లక్ష్య సేన్, గాయత్రి-ట్రీసా పరాజయం

లక్ష్య సేన్, గాయత్రి-ట్రీసా పరాజయం
  • ఆల్ ఇంగ్లండ్‌‌‌‌ టోర్నీలో ముగిసిన ఇండియా పోరాటం

బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా పోరాటం ముగిసింది. లక్ష్యసేన్, పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ క్వార్టర్ ఫైనల్లోనే ఓడి వెనుదిరిగారు. -శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌‌‌‌లో 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 10–-21, 16–-21 తేడాతో  ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో వరుస గేమ్స్‌‌‌‌లో ఓడి నిరాశపరిచాడు. ఆట ఆరంభంలోనే  ఫెంగ్ దూకుడు చూపెట్టి 9-–4 ఆధిక్యంలోకి వెళ్లాడు.  - బ్రేక్ సమయానికి 11–-4 తేడాతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించాడు.  లక్ష్య సేన్ క్రాస్‌‌‌‌కోర్ట్ స్మాష్‌‌‌‌లతో ప్రయత్నించినా, ఫెంగ్ దూకుడును ఆపలేకపోయాడు. 

 రెండో గేమ్ - ప్రారంభంలో సేన్ పుంజుకొని 10-–8 ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ, ఫెంగ్ మళ్లీ స్పీడు పెంచి 17-–15 ఆధిక్యం సాధించాడు. ఈ టైమ్‌‌‌‌లో సేన్ చేతికి గాయమై  రక్తం రావడంతో కాసేపు ఆటను నిలిపేశారు. చికిత్స తీసుకొని  మ్యాచ్‌‌‌‌ కొనసాగించినా గాయం అతని ఆటను ప్రభావితం చేసింది. దాంతో ఫెంగ్ గేమ్‌‌‌‌తో పాటు మ్యాచ్ నెగ్గాడు. విమెన్స్ డబుల్స్‌‌‌‌లో గాయత్రి–ట్రీసా14-–21, 10–-21తో రెండో సీడ్స్  లియూ షెంగ్షు– - టాన్ నింగ్ (చైనా)చేతిలో ఓడారు.