ఇండోనేసియా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీలో లక్ష్యసేన్‌‌‌‌ ఔట్‌‌‌‌

ఇండోనేసియా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీలో లక్ష్యసేన్‌‌‌‌ ఔట్‌‌‌‌

జకర్తా : ఇండోనేసియా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీలో ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్లు లక్ష్యసేన్‌‌‌‌, సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ జోడీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌ 16–21, 21–12, 21–23తో కెంటా నిషిమోటో (జపాన్‌‌‌‌) చేతిలో పోరాడి ఓడాడు. 50 నిమిషాల పోరాటంలో లక్ష్యకు మెరుగైన ఆరంభం లభించలేదు. పేలవమైన షాట్లతో తొలి గేమ్‌‌‌‌ను కోల్పోయాడు. అయితే రెండో గేమ్‌‌‌‌లో మెరుగ్గా ఆడినా డిసైడర్‌‌‌‌లో స్మాష్‌‌‌‌లు ఆడటంలో తడబడ్డాడు. 

మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ 20–22, 21–23తో కెడ్రెన్‌‌‌‌–డెచ్‌‌‌‌పోల్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌ కపిల–తనీషా క్రాస్టో 21–18, 15–21, 19–21తో పాంగ్‌‌‌‌ రోన్‌‌‌‌ హు–సు యిన్‌‌‌‌ చెంగ్‌‌‌‌( మలేసియా) చేతిలో, విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో అశ్విని–తనీషా క్రాస్టో 21–13, 22–24, 18–21తో గో పి కీ–తియోహ్‌‌‌‌ మి జింగ్‌‌‌‌ (మలేసియా) చేతిలో ఓడారు.