Lakshya Sen: బ్యాడ్మింటన్‌లో నేను కోహ్లీలా ఆడాలి: లక్ష్య సేన్

Lakshya Sen: బ్యాడ్మింటన్‌లో నేను కోహ్లీలా ఆడాలి: లక్ష్య సేన్

కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇటీవల ఒక పోడ్‌కాస్ట్ రణ్‌వీర్ అలహబాడియా షోలో మాట్లాడుతూ.. తాను బ్యాడ్మింటన్ లో విరాట్ కోహ్లీలా అవ్వాలనే తన కోరికను బయట పెట్టాడు. ఈ షో లో దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలికలు గురించి అడిగినప్పుడు సేన్ "రాబోయే సంవత్సరాల్లో నేను భారత బ్యాడ్మింటన్‌లో విరాట్ కోహ్లీగా మారాలనుకుంటున్నాను. అతను భారత క్రికెట్‌కు చాలా చేశాడు". అని లక్ష్య సేన్ అన్నాడు.  

Also Read:-హార్ట్ సర్జరీ విజయవంతం.. అప్పుడే బ్యాట్ పట్టిన భారత అండర్ 19 కెప్టెన్

ఈ సందర్భంగా కోహ్లీతో తనకు ఉన్న పోలిక గురించి మాట్లాడాడు. ఇండోనేషియాకు ప్లేయర్ జొనాటన్ క్రిస్టీ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన నో-లుక్ రివర్స్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌ను కొట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ అద్భుతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్ టీ20 ప్రపంచ కప్ 2022 లో పాకిస్థాన్ పై హారిస్ రౌఫ్‌ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ కొట్టిన  ఐకానిక్ సిక్స్‌తో పోల్చబడింది. 

పారిస్ ఒలింపిక్స్‌లో సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన లక్ష్యసేన్.. ఈ మ్యాచ్ గెలిస్తే పతకం ఖాయమనుకున్న దశలో నిరాశ పరిచాడు. ఆదివారం(ఆగష్టు 04) జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్య సేన్.. ప్రపంచ నెం. 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్‌‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 20-22, 14-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. కాంస్య పతక పోరులోనూ  లక్ష్యసేన్ ఓడిపోవడంతో ఎలాంటి మెడల్ లేకుండానే ఒలింపిక్స్ ప్రయాణాన్ని ముగించాడు.