ల‌లిత్ మోడీపై టీమిండియా మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

ల‌లిత్ మోడీపై టీమిండియా మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్ ..ఐపీఎల్  వ్యవ‌స్థాప‌కుడు ల‌లిత్ మోడీసంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి ఐపీఎల్ సీజన్ లో తనకు ఎదురైన అనుభవాన్ని భయటపెట్టాడు.  తొలి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడడం ఇష్టం లేదని...  ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ )తరుపున తాను ఆడాలని అనుకున్నట్లుగా తెలిపాడు.  

ఎందుకంటే బెంగ‌ళూరు తమ స్వస్థలానికి చాలా దూరంగా ఉంటుందని పైగా తనకు అంతగా ఇంగ్లీష్ రాదని చెప్పుకొచ్చాడు. దీంతో  ఢిల్లీ డేర్‌డెవిల్స్  అయితే తనకు చాలా బాగుంటుందని అనుకున్నానని తెలిపాడు.   కానీ ఆర్‌సీబీ కాంట్రాక్టుపై సంత‌కం చేయ‌కుంటే తన  కెరీర్‌ను నాశానం చేస్తానని ల‌లిత్ మోడీ బెదిరించాడని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 

ప్రవీణ్ కుమార్ 2018లో ఐపీఎల్ వేలంలో ఏ జట్టుకు అమ్ముడుపోకపోవడంతో   రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక టీమిండియా తరుపున  2007 నుంచి 2012 వరకు ప్రవీణ్ కుమార్ ప్రాతినిధ్యం వహించాడు.  టీమిండియా త‌ర‌ఫున ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్ లో  ఆర్సీబీ, కింగ్స్ లెవ‌న్ పంజాబ్, సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, గుజ‌రాత్ ల‌య‌న్స్ వంటి ఫ్రాంచైజీల‌కు ఆడాడు.