పరారీలో ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చీఫ్ లలిత్ మోదీ విజయ్‌మాల్యా (Vijay Mallya) కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహంలో కనిపించారు. లండన్ లో శనివారం ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో లలిత్ మోదీ కనిపించడం ఇపుడు చర్చనీయాంశం అయ్యింది. వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యూఎస్‌జీ) అధికారులతో కలిసి రూ.753 కోట్లను మోసం చేశారని లలిత్ మోడీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే లలిత్ మోదీ BCCI నుండి సస్పెండ్ చేయబడ్డాడు.
ఇక అప్పటినుండి పరారీలోనే ఉన్న ఆయన తాజాగా లలిత్ మోదీ విజయ్‌మాల్యా (Vijay Mallya) కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహంలో కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్‌మాల్యా (Vijay Mallya) కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహ విషయానికి వస్తే.. లండన్ సమీపంలోని ఓ విలాసవంతమైన ఎస్టేట్‌లో సిద్ధార్థ్ మాల్యా వివాహ వేడుక ఘనంగా జరిగింది. సిద్ధార్థ్ మాల్య తన స్నేహితురాలు జాస్మిన్ ఉంగరాలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే.. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహానికి సిద్ధార్థ్ మాల్యా సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరవడం విశేషం.