- లలితా జ్యువెలరీ 55 వ షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: నగల కంపెనీ లలితా జ్యువెలరీ హైదరాబాద్‌లోని సుచిత్రా సర్కిల్‌లో ఏర్పాటు చేసిన షోరూమ్‌ను ఆదివారం ప్రారంభించింది. కంపెనీకి ఇది 55 వ షోరూమ్. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ దీనిని ప్రారంభించారు. ఈ కొత్త షోరూమ్‌లో తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందిస్తున్నామని కంపెనీ చెబుతోంది.
ఇతర షోరూమ్‌లలో దొరకని ‘గోల్డ్ కొనుగోలు స్కీమ్’ ను అందుబాటులోకి తెచ్చామని తెలిపింది. అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు అందివ్వాలని ఉద్దేశంతో ఈ షోరూమ్‌ను లాంచ్ చేశామని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, సోమాజిగూడ, దిల్‌సుఖ్‌నగర్, చందానగర్‌లో లలితా జ్యువెలరీకి షోరూమ్‌లు ఉన్నాయి. ఆంధ్రా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా షోరూమ్‌లను నిర్వహిస్తున్నామని కంపెనీ చైర్మన్ ఎం కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
లలితా జ్యువెలరీ ‘ధన వందనం’ స్కీమ్..
లలితా జ్యువెలరీ 11 నెలల కొనుగోలు స్కీమ్ ‘ధన వందనం’ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘కస్టమర్లు నెల నెలా కట్టే డబ్బును బంగారంగానూ, డబ్బుగానూ ఆదా చేసుకోవచ్చు. ఏ నగ అయినప్పటికీ 50 శాతం తరుగు ఉండదు. అలానే ఒక నెల ఇన్‌స్టాల్‌మెంట్‌లో 50 శాతం బోనస్‌ను అందిస్తున్నాం. కస్టమర్లు నెలకు రూ. వెయ్యి, రూ.1,500, రూ.2,000, రూ.2,500, రూ.5,000, రూ. 10,000 చొప్పున ఏదో ఒక వాయిదాలో ఈ స్కీమ్‌ను ఓపెన్ చేయొచ్చు’ అని లలితా జ్యువెలరీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.