దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి

దుమ్కా కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన లాలు... డోరండా ట్రెజరీ కేసులో దోషిగా తేలారు. రాంచీ సీబీఐ కోర్టు లాలు ప్రసాద్ యాదవ్ ని దోషిగా తేల్చింది. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ సహా మొత్తం 110 మంది నిందితులుగా ఉన్నారు. జనవరి 29న డిఫెన్స తరఫున వాదనలు పూర్తి చేసిన తర్వాత.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లాలూను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇంకా లాలూకు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. 36 మంది దోషులకు మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.  ప్రత్యేక కోర్టు.1990 నుంచి 1995 మధ్య కాలంలో డోరాండా ట్రెజరీ నుంచి 139 కోట్ల 35 లక్షలు అక్రమంగా విత్ డ్రా చేసినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి మొత్తం 575 మంది సాక్షుల వాంగ్మాలాలు తీసుకున్నారు. ఈ కేసులో వాదోపవాదాలు ఆగస్టు 7, 2021న పూర్తయ్యాయి. ఇప్పడికే దియోఘర్, దుమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ పొందారు లాలు ప్రసాద్. ఇప్పటికే పలు కేసుల్లో లాలూకు శిక్ష పడింది.