లంబాడి భాషను ఎనిమిదో షెడ్యూల్​లో చేర్చాలి ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్

లంబాడి భాషను ఎనిమిదో షెడ్యూల్​లో చేర్చాలి ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్

ముషీరాబాద్,వెలుగు: దేశ వ్యాప్తంగా లంబాడీలు మాట్లాడే గోరు బోలి భాషను  రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​లో  చేర్చాలని ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. లంబాడి హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ సక్రు నాయక్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.  

ఏఐసీసీ ఆదివాసి కాంగ్రెస్ జాతీ య వైస్ చైర్మన్, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ హాజరై మాట్లాడారు. కేంద్రం లంబాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.  పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ , రమేష్ నాయక్, చందర్, అశోక్, లక్ష్మణ్ పాల్గొన్నారు.