ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు.. ఆరోగ్యం ఉండాలంటే సమతులాహారం అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.. ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి దేశంలోని ప్రజలకు సంతులిత ఆహారం అందుతుందా? ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నారా..? ఎంత మందికి పరిపుష్టమైన ఆహారం అందుతుంది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో.. తాజా అధ్యయనాలు భయంకరమైన నిజాలను బయటపెట్టాయి. పిల్లలు, యూత్ లో పోషకాహారం ఉందని.. ఇదే గనక కంటిన్యూ అయితే జరిగే పరిణామాలు, ఎదుర్కొనే దుర్భర పరిస్థితులను ఈ అధ్యయనాలు వెల్లడించాయి.
ది లాన్సెడ్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో వచ్చిన ఓ అధ్యయనం ఆర్టికల్ ప్రకారం.. భారత దేశంలో అన్ని వయసుల వారు.. స్త్రీ, పురుష బేధం లేకుండా ఐరన్, కాల్షియం , ఫోలేట్ వంటి ఆరోగ్యానికి కీలకమైన సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. ఈ పోషకాలు తగినంత పరిమాణంలో అందడం లేదని .. భవిష్యత్ లో ఇవి తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించింది.
భారత్ లో పిల్లలు, యూత్ లో సూక్ష్మ పోషకాల లోపం..
- మన దేశంలో పురుషలలో కంటే స్త్రీలలో ఎక్కువ అయోడిన్ లోపం ఉంది.
- మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో జింక్, మెగ్నీషయం లోపం ఉంది
- ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం మంది అయోడిన్, విటమిన్ ఇ, కాల్షియం లోపంతో జీవిస్తున్నారు.
- 10నుంచి 30 యేళ్లలోపు కాల్షియం లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పరిష్కారం
సూక్ష్మ పోషకాల లోపాలను అధిగమించాలంటే..పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి..వారి ఆరోగ్య స్థితిని బట్టి ఆహారం సిఫారసు చేయాలి..పోషకాహార లోపంపై ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పరిశోధకులు చెబుతున్నారు. సప్లిమెంట్లను కూడా సిఫారసు చేసింది. ప్రజారోగ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించింది.