
ఫ్యూచర్ సిటీ లో భాగంగా నిర్మించబోయే యూనివర్సిటీలు, ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్ సహా వివిధ ఇండస్ట్రీలు, ఎంటర్టైన్మెంట్ జోన్, ఫర్నిచర్ పార్క్, హెల్త్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, స్పోర్ట్స్‌హబ్, నివాస, వాణిజ్య ప్రాంతాలకు ఎఫ్‌సీడీఏ భూ కేటాయింపులు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే14 వేల ఎకరాల భూమి కేటాయించింది. కాగా, ఇందులో గ్రీన్ ఫార్మా కంపెనీలను కొనసాగించాలని నిర్ణయించడంతో లైఫ్ సైన్సెస్ వంటి వాటికి కేటాయింపుల్లో మార్పుచేర్పులు ఉంటాయని భావిస్తున్నారు.
దాదాపు 6- నుంచి 8 వేల ఎకరాలు నాన్ పొల్యూటెడ్ ఫార్మా కంపెనీలకు ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన వారికి నివాసాలు, స్కూల్స్, హాస్పిటల్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 4 నుంచి 5 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఏఐ సిటీకి 297 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించగా, దానికి మరో 250 ఎకరాలు అదనంగా ఇవ్వాలని భావిస్తున్నారు. యూనివర్సిటీల జోన్‌కు 600 ఎకరాలకు పైగా కేటాయించాలని అనుకుంటున్నారు.
ఎలక్ట్రానిక్స్, సాధారణ ఇండస్ట్రీలకు 6 వేల ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ జోన్‌కు 550 ఎకరాలు, ఫర్నిచర్ పార్క్‌కు 450 ఎకరాలు, హెల్త్ సిటీకి 550 ఎకరాలు, లైఫ్ సైన్సెస్ హబ్‌లో ఫార్మా కంపెనీలు మినహాయించి 3 వేల ఎకరాలు, నివాస, వాణిజ్య ప్రాంతాలకు 3,500 ఎకరాలు, నివాస ప్రాంతాలకు 2 వేల ఎకరాలు, స్పోర్ట్స్ హబ్‌కు 850 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఆయా కేటాయింపులను ఎఫ్ సీడీఏ పర్యవేక్షించనుంది.