
అంబర్పేట, వెలుగు: గోల్నాక నుంచి అంబర్ పేట వరకు రూ.335 కోట్ల అంచనాతో చేపట్టిన ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి మంగళవారం పరిశీలించారు. భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఫ్లైఓవర్ కు సంబంధించిన సివిల్ పనులు పూర్తయ్యాయని ఎస్ఈ ధర్మారెడ్డి తెలిపారు. సర్వీస్ రోడ్డు వేసేందుకు వివిధ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ పెండింగ్ ఉందన్నారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, రఘుప్రసాద్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ దివాకర్, జోనల్ ఎస్ ఈ రత్నాకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ దివాకర్, ఈఈ తదితరులు పాల్గొన్నారు.