భూభారతితో భూ సమస్యలు తీరుతయ్ : వివేక్​ వెంకటస్వామి

భూభారతితో  భూ సమస్యలు తీరుతయ్ : వివేక్​ వెంకటస్వామి
  • బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో వేల ఎకరాలు కొల్లగొట్టారు: వివేక్​ వెంకటస్వామి
  • కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం తెచ్చిన భూభారతి దేశానికి రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌
  • భూభారతి చట్టం అవగాహన సదస్సులో చెన్నూరు ఎమ్మెల్యే

కోల్​బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు:భూభారతి ద్వారా రైతుల భూ సమస్యలు శాశ్వతంగా తీరుతాయని, ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రైతు వేదిక, చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్​హాల్‌‌‌‌‌‌‌‌లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. రైతులను మోసం చేయడానికే గత బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని, పేదలకు ఇచ్చిన భూములను ధరణి పేరుతో కొల్లగొట్టిందని ఆరోపించారు. 

హైదరాబాద్ చుట్టుపక్కల, రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో వేల ఎకరాలను బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేశారన్నారు. ఒకే భూమిని ఎక్కువ మందికి అమ్ముతూ దోచుకున్నారని మండిపడ్డారు. పట్టా భూములను ప్రోహిబిటేడ్ కింద చూపించి దోపిడీకి పాల్పడ్డారన్నారు. త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఆ భూముల చిట్టా బయటకు తీసి, నిజమైన యాజమానులకు అప్పగిస్తామని చెప్పారు. పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపైనా హక్కులు కల్పిస్తామని తెలిపారు. భూభారతి కింద భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని, దీంతో భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో రైతులకు భూ సమస్యలు, వివాదాలు రావన్నారు. భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ పోర్టల్‌‌‌‌‌‌‌‌పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరిస్తుందని చెప్పారు. భూములకు సంబంధించి ఒత్తిళ్లు, పైరవీలకు ఆఫీసర్లు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. 

సింగరేణి రిటైర్డ్​ ఉద్యోగులకు అండగా ఉంటాం..

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తాను అండగా ఉంటామని వివేక్ వెంకటస్వామి అన్నారు. రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.10 వేలు అందించేలా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద వంశీకృష్ణ ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై పార్లమెంటులో కూడా ప్రస్తావించార ని గుర్తుచేశారు. ఎంపీ వంశీకృష్ణ ఒత్తిడితోనే కేంద్రం, సింగరేణి సంస్థ పెన్షన్ కార్పస్ ఫండ్ నిధికి రూ.140 కోట్లు మంజూరు చేసిందని, దీని వల్ల 84 వేల మంది రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ కార్మికుల మెడికల్ ఫెసిలిటీ రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని, ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరినట్టు చెప్పారు. 

భీమారం మండలం నర్సింగా పూర్ రైతుల కోరిక మేరకు చెరువు అభివృద్ధి, రిపేర్ల కోసం సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. మందమర్రిలో ప్రారంభించిన ఎమ్మెల్యే రెండో క్యాంప్ (బీ1 ఆఫీస్) ఆఫీస్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, మందమర్రి, జైపూర్, చెన్నూరు తహసీల్దార్లు​సతీశ్ కుమార్, వనజారెడ్డి, మల్లికార్జున్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్లు తుంగపిండి రాజలింగు, గద్దె రాజు, ఎంపీడీవోలు మోహన్ రెడ్డి, మధుసూదన్, ఇరిగేషన్​డీఈ శారద, కాంగ్రెస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు. 

మరోవైపు,భీమారం మండలం నర్సింగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోరూ.40 లక్షలతో చేపట్టిన చెరువు అభివృద్ధి, రిపేర్​పనులకు, మందమర్రి మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో రూ.10 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. భీమారం మండల కేంద్రంలోని పోలంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జైపూర్, చెన్నూరు మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.