న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ –జూన్ క్వార్టర్‌లో దేశం మొత్తం మీద కేవలం 25 ల్యాండ్ డీల్స్ మాత్రమే జరిగాయని, మొత్తం 325 ఎకరాల కోసం డీల్స్ పూర్తయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ పేర్కొంది. జనరల్ ఎలక్షన్స్‌తో పాటు ల్యాండ్ ధరలు ఎక్కువగా ఉండడంతో డెవలపర్లు భూములను కొనుగోలు చేయడానికి వెనకడగు వేశారని తెలిపింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో మొత్తం 725 ఎకరాల కోసం 29 ల్యాండ్ డీల్స్ జరిగాయి.
అనరాక్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో బెంగళూరులో 114 ఎకరాల కోసం 9 ల్యాండ్ డీల్స్ జరగగా, గురుగ్రామ్‌లో 77.5 ఎకరాల కోసం 7 డీల్స్ జరిగాయి. హైదరాబాద్‌లో 48 ఎకరాల కోసం ఒక డీల్ పూర్తయ్యింది. మొత్తం ల్యాండ్ డీల్స్‌లో 17 డీల్స్ (163 ఎకరాలు) రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల కోసం జరిగాయి.