రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదం హత్యకు దారి తీసింది. మార్కింగ్ వాక్ చేస్తున్న సమయంలో జార్జ్(62), సమర్జిత్ సింగ్ (52) అనే ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. జార్జ్ తలపై సమర్జిత్ సింగ్ రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.
స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 30 గుంటల భూమి వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
గత మూడు రోజుల క్రితం జార్జ్ కు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్దార్ ఆ భూమిని చదును చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో సర్దార్.. జార్జ్ పై దాడి చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.