- నేరడిగొండ మండలంలోని కొరిటికల్ లో ఘటన
నేరడిగొండ, వెలుగు: నేరడిగొండ మండలంలోని కొరిటికల్ గ్రామంలో పండుగపూట ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి కొంత కాలంగా భూ వివాదం సాగుతోంది. ఈ విషయంలో వారి మధ్య బుధవారం మరోసారి గొడవ మొదలైంది.
మాటామాటా పెరగడంతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణను అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణలో గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు. ఘర్షణకు పాల్పడిన ఇరు వర్గాలకు చెందిన 23 మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.