
శంకర్ పల్లి, వెలుగు: భూమి వివాదానికి సంబంధించి బంధువుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఓ మహిళ మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన శంకర్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై సంతోశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని పర్వేద గ్రామానికి చెందిన అనంతయ్య, లింగమ్మ(55) దంపతులకు, వారి బంధువులకు మధ్య ఏడాది కాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం మరోసారి గొడవ జరగగా.. లింగమ్మ మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని టైమ్లో ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేశారు.