పెద్దపల్లి జిల్లాలో వాటర్ ట్యాంక్ ఎక్కి భూ నిర్వాసితుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ ఎస్సీ కాలనీలో భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం నాలుగు రోజులుగా కరెంటు కట్ చేసి.. తమను ఇబ్బందులకు గురి చేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్పోయిన భూములకు నష్టపరిహారం ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు చందనాపూర్ ఎస్సీ కాలనీ భూ నిర్వాసితులు. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దిగాలని బాధితులను పోలీసులు కోరారు. జిల్లా కలెక్టర్, RDO, సింగరేణి అధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తాము వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దిగి రామని స్పష్టం చేశారు భూ నిర్వాసితులు.