అర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి : భూ నిర్వాసితులు

అర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి : భూ నిర్వాసితులు

జైపూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్​లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించేలా చూడాలని చెన్నూర్ ఎమ్మెల్యే డా.గడ్డం వివేక్ వెంకటస్వామిని జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తదారిపల్లి  భూ నిర్వాసితులు కోరారు. చెన్నూర్​లోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు. 

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం చేపట్టిలో సెస్ సర్వేలో 25 కుటుంబాల పేర్లు ఉన్నప్పటికీ చిన్నచిన్న కారణాలు చూపి సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇండ్లు ఓపెన్ కాస్ట్ పక్కనే ఉండడంతో బాంబ్ బ్లాస్టింగ్, భారీ వాహనాల నుంచి వచ్చే శబ్ద కాలుష్యం, దుమ్మ దూళితో అనారోగ్యం బారిన పడుతున్నామని పేర్కొన్నారు. ఇదే ఓపెన్ కాస్ట్​లో ఇండ్లు కోల్పోయిన సింగపూర్ గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించిన విధంగానే తమకూ చెల్లించి న్యాయం చేయాలని కోరారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో పర్యటించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదివారం పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాసీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్​ సీనియర్ ​లీడర్, మాజీ ఎంపీపీ బన్న ఆశాలు ప్రథమ వర్ధంతికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి హాజరయ్యారు. ఆశాలు కుటుంబసభ్యులను పరామర్శించారు. హాజీపూర్​ మండలం పడ్తనపల్లి మాజీ సర్పంచి అంకం లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వివేక్ ​వెంకటస్వామి ఆమె కొడుకులు కృష్ణమూర్తి, మారుతితోపాటు కుటుంబసభ్యులను పరామర్శించారు.