హైదరాబాద్లో పెట్టుబడి పెట్టండి గానీ ఇసొంటోళ్లతో జాగ్రత్త..!

హైదరాబాద్లో పెట్టుబడి పెట్టండి గానీ ఇసొంటోళ్లతో జాగ్రత్త..!

రంగారెడ్డి జిల్లాలో ప్లాట్ల పేరుతో మోసం చేసిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు ప్లాట్లని చెప్పి జనాలను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ రేటుకు ప్లాట్ ఇప్పిస్తామని అమాయకులను మోసం చేస్తూ.. తిరుగుతున్న ఇద్దరి వ్యక్తులను నార్సింగి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో అమాయకులను టార్గెట్ చేస్తూ వారికి తక్కువ ధరలో ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న కామిరెడ్డి రాజేంద్రప్రసాద్, వేపరాల గురు కుమార్ అనే ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు.

►ALSO READ | పది రోజుల్లో కూతురి పెళ్లి పెట్టుకుని.. కాబోయే అల్లుడితో అత్త లేచిపోవడం ఏంట్రా సామీ..!

తక్కువ రేట్లకు ప్లాట్ ఇప్పిస్తామని చెప్పి బాధితుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని పరారవుతుంటారు. ఇందులో ఒక బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వీళ్ల బాగోతం బయటపడింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు.