మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు

మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పేట్ బషీరాబాద్ లో 32  గుంటల స్థలం చేశారని వారిపై ఆరోపణలున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని బాధితుడు కంప్లైంట్ చేశాడు. 

మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో   మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు భూకబ్జాలకు పాల్పడినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. 32 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు నివేదిక లో వెల్లడించారు. డాక్యుమెంట్ల ప్రకారం మల్లారెడ్డికి 29 గుంటల భూమి మాత్రమే ఉందని పేర్కొన్నారు. సుచిత్రలోని సర్వే నంబర్‌‌‌‌ 82లోని వివాదాస్పద భూము లపై రెవెన్యూ శాఖ అధికారులు జూన్ 13న  హైకోర్టుకు నివేదిక అందించారు.

 ఈ భూవివాదంలో గతంలోనే 15 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు కేసులు, ఆదేశాలు ఉన్నప్పటికీ.. 32 గుంటలకుపైగా ఆక్రమించుకున్నారని నివేదికలో వెల్లడించారు. వివాదాస్పద భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. ఫెన్సింగ్‌‌ను తొలగించి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సర్వే రిపోర్ట్‌‌ను కోర్టు ద్వారా సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. ప్రభుత్వ భూమిలోకి ఇతరులు  అక్రమంగా ప్రవేశించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు.