హైదరాబాద్​లో భూములపై పెట్టుబడి రూ.7 వేల కోట్లు

  • కిందటేడాది ఈ లావాదేవీలు జరిగాయన్న సీబీఆర్​ఈ

హైదరాబాద్​, వెలుగు: మనదేశంలో గత ఏడాది అతిపెద్ద రియల్టీ డీల్​ హైదరాబాద్​లోనే జరిగిందని సీబీఆర్ఈ అనే కన్సల్టింగ్​ కంపెనీ తెలిపింది.  హైదరాబాద్​కు చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ ​నార్సింగిలో 25 ఎకరాల భూమిని కొందని తెలిపింది. డెవలపర్​ 18 ఎకరాల భూమిని నేరుగా కొన్నారు. మిగతా ఏడు ఎకరాల భూమిని జాయింట్​ డెవెలప్​మెంట్​విధానంలో తీసుకున్నారు. ఇక్కడ హై-ఎండ్ రెసిడెన్షియల్ టౌన్‌‌షిప్​ను కడతారని సీబీఆర్​ఈ ప్రకటించింది. భూ ఒప్పందాన్ని కుదిర్చేందుకు తమ సేవలను డెవెలపర్  ఉపయోగించుకున్నారని సీబీఆర్​ఈ తెలిపింది. అయితే ఈ డీల్​ విలువను మాత్రం వెల్లడించలేదు. హైదరాబాద్​కు 2019‌‌‌‌–-2020లో సుమారుగా బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7,300 కోట్లు) పెట్టుబడులు వచ్చాయని ఈ కంపెనీ రిపోర్టు వెల్లడించింది. రాబోయే నెలల్లో ఇన్వెస్ట్​మెంట్లు 50 శాతం దాకా పెరుగుతాయని అంచనా వేసింది.  కమర్షియల్, హైరైజ్​ బిల్డింగులకు ఇన్వెస్ట్​మెంట్లు ఎక్కువ రావొచ్చని తెలిపింది.  రాజపుష్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ నార్సింగి ప్రాజెక్ట్ నగరంలోని రెసిడెన్షియల్ ​ప్రాజెక్టులలో ఒక మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

శేఖర్ కమ్ముల ‘నీ చిత్రం చూసి’ సాంగ్ రిలీజ్

ఇంగ్లండ్‌‌‌‌ను చెడుగుడు ఆడేసుకున్నారు

25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు

గ్రెటా థన్‌బర్గ్ ‘టూల్ కిట్’కు సాయం.. బెంగళూరు స్టూడెంట్‌ అరెస్ట్‌